2023David WarnerINMitchell MarshPakistan national cricket team

మిచెల్‌ మార్ష్‌ అరుదైన రికార్డు.. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే! – Trending News

మిచెల్‌ మార్ష్‌ అరుదైన రికార్డు.. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే!

మిచెల్‌ మార్ష్‌ అరుదైన రికార్డు.. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే!

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌లో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. పాకిస్తాన్‌ బౌలర్లను మార్ష్‌ ఊచకోత కోశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 108 బంతులు ఎదుర్కొన్న మార్ష్‌ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 121 పరుగులు చేశాడు.

Read More

AUS vs PAK : దంచి కొట్టిన వార్నర్, మార్ష్.. పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్.. ఎంతంటే?

AUS vs PAK : దంచి కొట్టిన వార్నర్, మార్ష్.. పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్.. ఎంతంటే?

AUS vs PAK ICC ODI world Cup 2023 Australia Put massive target for pakistan sjn | AUS vs PAK – ICC ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్ 2023 (ICC ODI World Cup 2023)లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు తొలిసారి రెచ్చిపోయారు. గత మూడు మ్యాచ్ ల్లో భారీ స్కోర్లను సాధించడంలో విఫలం ఠయిన ఆసీస్.. పాకిస్తాన్ (Pakistan)తో జరుగుతున్న పోరులో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగింది.

Read More

ODI WC 2023: ఎవరిదో పైచేయి?

ODI WC 2023: ఎవరిదో పైచేయి?

వరుసగా రెండు విజయాలతో టోర్నీని ఆరంభించి గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో చిత్తయిన పాకిస్థాన్‌ ఓ వైపు. వరుసగా రెండు ఓటములతో ప్రపంచకప్‌ను మొదలెట్టి గత మ్యాచ్‌లో శ్రీలంకపై గెలుపుతో పుంజుకున్న ఆస్ట్రేలియా మరోవైపు. ఇలా ఇప్పటివరకూ ఈ మెగా టోర్నీలో విభిన్న దారుల్లో ప్రయాణిస్తున్న ఈ రెండు జట్లు శుక్రవారం తలపడబోతున్నాయి.

Read More

బాబర్‌ ఆజం తెలివి అంతే.. వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త రివ్యూ! వీడియో వైరల్‌

బాబర్‌ ఆజం తెలివి అంతే.. వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త రివ్యూ! వీడియో వైరల్‌

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. పాకిస్తన్‌ మాత్రం తమ తుది జట్టులో ఒకే ఒక మార్పు చేసింది. ఏకంగా తమ వైస్‌ కెప్టెన్‌పై వేటు వేసిన పాక్‌ జట్టు మేనెజ్‌మెంట్‌.. యువ స్పిన్నర్‌ ఉస్మా మీర్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటిచ్చింది.

Read More

మార్ష్, వార్నర్ మెరుపు సెంచరీలు.. పాకిస్థాన్‌ను చితక్కొట్టిన ఆస్ట్రేలియా..

మార్ష్, వార్నర్ మెరుపు సెంచరీలు.. పాకిస్థాన్‌ను చితక్కొట్టిన ఆస్ట్రేలియా..

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. ఆసీస్ ఓపెనర్ల జోరుతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 367 పరుగుల భారీ స్కోరు సాధించింది. మార్ష్, వార్నర్ దెబ్బకు ఓ దశలో 400 పరుగులు చేసేలా కనిపించిన కంగారులు.. మిడిలార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో చివరకు 9 వికెట్ల నష్టానికి 367 పరుగులకు పరిమితమయ్యారు. బౌలర్ల ప్రదర్శనకు తోడు పాకిస్థాన్ ఫీల్డర్ల వైఫల్యం కూడా ఆస్ట్రేలియాకు కలిసివచ్చింది.

Read More

David Warner: పాక్ పై వార్నర్ సూపర్ సెంచరీ… తగ్గేదే లే అంటూ సెలబ్రేషన్

David Warner: పాక్ పై వార్నర్ సూపర్ సెంచరీ... తగ్గేదే లే అంటూ సెలబ్రేషన్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ పరుగుల సునామీ సృష్టించింది. పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ పోటాపోటీగా సెంచరీలు బాదడంతో ఆసీస్ అతి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. వార్నర్ 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోగా, మార్ష్ 100 బంతుల్లో సెంచరీ సాధించాడు. పిచ్ పై పచ్చిక చూసి బౌలింగ్ కు అనుకూలిస్తుందని భావించిన పాక్ సారథి బాబర్ అజామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పై ఉన్న పచ్చిక బౌన్స్ కు ఉపయోగపడిందే తప్ప స్వింగ్ లేకపోవడంతో పాక్ బౌలర్లు తేలిపోయారు. షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ వంటి సీనియర్ బౌలర్లు కూడా బెంగళూరు పిచ్ పై సాధారణ బౌలర్లుగా కనిపించారు. వార్నర్, మార్ష్ పోటీలు పడి మరీ పాక్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. ఆరంభంలో వార్నర్ ఇచ్చిన తేలికైన క్యాచ్ ను ఉసామా మిర్ జారవిడవడం ఎంత పెద్ద తప్పిదమో మ్యాచ్ సాగే కొద్దీ తెలిసి వచ్చింది. వార్నర్ సిక్సర్ల మోత మోగించాడు. సెంచరీ పూర్తవగానే ‘తగ్గేదే లే’ అంటూ గడ్డం కింద చేయిపోనిచ్చి పుష్ప స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే మార్ష్ సెంచరీ కూడా పూర్తవడం విశేషం. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 33.5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 259 పరుగులు. వార్నర్ 124 పరుగులతో ఆడుతున్నాడు. మార్ష్ 121 పరుగులు చేసి షహీన్ అఫ్రిది బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్ సున్నాకే వెనుదిరిగాడు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button