CWC 2023: పాకిస్థాన్ దిమ్మ తిరిగింది.. ఫిర్యాదుపై షాకిచ్చిన ఐసీసీ!
టీమిండియా మీద విషం కక్కాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలకు గండిపడినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ మ్యాచ్ మీద ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాక్ తగిలేలా కనిపిస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. అయితే మ్యాచ్‌లో ప్రేక్షకుల ప్రవర్తన మీద ఐసీసీ తలుపు తట్టిన పీసీబీకి.. అక్కడ కూడా చుక్కెదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్థాన్ ఫిర్యాదు మీద ఐసీసీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోగా.. చర్యలు తీసుకోలేకపోవడానికి అదే కారణంగా తెలుస్తోంది.
Read MoreCrickek World Cup 2023: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఊహించని షాక్.. ఐసీసీ కూడా భారత్ వైపే
భారత్‌తో మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని ప్రేక్షకులు పాకిస్థాన్ ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారని పాక్ క్రికెట్ బోర్డు ICCకి నిన్న (అక్టోబర్ 17) అధికారికంగా ఫిర్యాదు చేయడం షాక్ కి గురి చేస్తుంది. అంతేకాదు పాకిస్థాన్ జర్నలిస్టుల వీసాల ఆలస్యం చేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. టాస్ సమయంలో బాబర్ పిచ్ ని పరిశీలిస్తున్నప్పుడు ప్రేక్షకులు అతన్ని టార్గెట్ చేశారని, మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ స్క్వాడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
Read MoreICC | పాకిస్థాన్ బోర్డు ఫిర్యాదును కొట్టిపారేసిన ఐసీసీ .. వాళ్లపై చర్యలు తీసుకోలేమని స్పష్టీకరణ
ICC | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిమానులు చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టి పారేసింది. గత శనివారం (అక్టోబర్ 14న) అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరగ్గా.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో దుమ్మురేపిన టీమ్‌ఇండియా.. విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే.
Read MoreIND vs PAK: ఓటమి తట్టుకోలేక ఆస్పత్రి పాలైన పాకిస్థాన్ సూపర్ ఫ్యాన్.. బ్యాగ్ సర్దుకుంటూ …
ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోవటాన్ని ఆ జట్టు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం పోరాడకుండా చేతులెత్తేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒకానొక దశలో రెండు వికెట్ల నష్టానికి 155 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న పాకిస్థాన్ 191 పరుగులకే కుప్పకూలడం వారిని తీవ్రంగా బాధిస్తోంది. మరీ ఇలా ఎలా ఆడారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ టీమ్‌కు వీరాభిమానిగా అందరికీ సుపరిచితులైన బషీర్ చాచా.. ఏకంగా ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు..
Read Moreమా జట్టును వేధించారు.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు
ఈ నెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా పలువురు భారత అభిమానులు తమ జట్టును వేధింపులకు గురి చేశారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. టాస్ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్రాడ్‌కాస్టర్ రవిశాస్త్రితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు మైదానంలోని ప్రేక్షకులు బిగ్గరగా అరుస్తూ, తమ జట్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారని పీసీబీ ఆరోపించింది. మహ్మద్ రిజ్వాన్ ఔటై డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా పలువురు అభిమానులు ‘జై శ్రీరాం’ నినాదాలు చేసి అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పీసీబీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తమ జర్నలిస్టులకు వీసాల జాప్యం, భారత్‌లో ప్రవేశించకుండా (వరల్డ్‌కప్ మ్యాచ్‌లు చూసేందుకు) తమ అభిమానులపై అంక్షలు వంటి పలు అంశాలను కూడా పీసీబీ తమ ఫిర్యాదులో ప్రస్తావించింది. ఈ విషయాలను పీసీబీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. కాగా, పీసీబీ కొద్దిరోజుల కిందట కూడా ఇదే అంశాలపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
Read More