ICC ODI World Cup 2023 : విరాట్‌ను రెచ్చగొడితే మూల్యం చెల్లించుకున్నట్లే.. బంగ్లా క్రికెటర్ …
వన్డే ప్రపంచకప్ 2023 (ICC ODI World Cup 2023)లో విరాట్ కోహ్లీ (Virat Kohli) దూకుడు మీదున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు అర్ధ సెంచరీలతో కదం తొక్కాడు. రానున్న మ్యాచ్ ల్లో మరింత దూకుడుగా ఆడాలనే పట్టుదల మీద ఉన్నాడు.
Read MoreIND vs BAN: సహచరులకు విరాట్ కోహ్లీ కీలక సందేశం.. షకిబ్‌కు ఫిట్‌నెస్ టెస్టు
పుణె వేదికగా వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమ్‌ఇండియా (IND vs BAN) సర్వం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తన సహచరులకు కీలక సూచనలు చేశాడు.
Read MoreVirat Kohli: బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు జట్టు సభ్యులకు కోహ్లీ వార్నింగ్.. సమర్థించిన పాండ్యా!
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో పసికూనలైన ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు సంచలనాలు సృష్టించాయి. గత ఆదివారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో పటిష్ఠమైన ఇంగ్లండ్ టీమ్ ను ఆఫ్ఘన్ జట్టు 69 పరుగుల తేడాతో మట్టికరిపించింది. మరోవైపు బుధవారం నాడు ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో, ఈరోజు పూణేలో బంగ్లాదేశ్ తో టీమిండియా మ్యాచ్ జరగనున్న తరుణంలో జట్టు సభ్యులకు విరాట్ కోహ్లీ కీలక హెచ్చరికలు చేశాడు. ప్రపంచ కప్ లో చిన్న జట్లు అంటూ ఉండవని కోహ్లీ చెప్పాడు. కేవలం బలమైన జట్లపైనే దృష్టిని సారిస్తే… నిరాశ తప్పదని హెచ్చరించాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గురించి మాట్లాడుతూ… కొన్నేళ్లుగా షకీబ్ కు పోటీగా తాను చాలా క్రికెట్ ఆడానని… అతనికి ఆటపై ఎంతో నియంత్రణ ఉందని చెప్పాడు. అంతేకాదు, షకీబ్ ఎంతో ఎక్సీ పీరియన్స్ ఉన్న బౌలర్ కూడా అని తెలిపాడు. కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని… బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించడంలో దిట్ట అని చెప్పాడు. ఇలాంటి బౌలర్లను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయి నైపుణ్యంతో ఆడాలని సూచించాడు. వీరిని సమర్థంగా ఎదుర్కోలేకపోతే… ఒత్తిడి పెరుగుతుందని, ఔట్ అయ్యే అవకాశాలు ఉంటాయని హెచ్చరించాడు. కోహ్లీ వ్యాఖ్యలను హార్దిక్ పాండ్యా సమర్థించాడు. షకీబ్ ఒక స్మార్ట్ క్రికెటర్ అని కితాబునిచ్చాడు. బంగ్లాదేశ్ జట్టును కొన్నేళ్లుగా తన భుజాలపై మోస్తున్నాడని చెప్పాడు. మరోవైపు కోహ్లీపై షకీబ్ ప్రశంసలు కురిపించాడు. అధునాతన క్రికెట్ యుగంలో కోహ్లీ బెస్ట్ బ్యాట్స్ మెన్ అని ప్రశంసించాడు. కోహ్లీని 5 సార్లు ఔట్ చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తానని చెప్పాడు. విరాట్ వికెట్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమైనదే అని అన్నాడు.
Read MoreWorld cup: మరో 67 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు బ్రేక్ చేయనున్న గిల్.. సౌతాఫ్రికా దిగ్గజం …
Home » Sports » Cricket News » World cup: Shubman Gill needs 67 runs in the next 3 innings to become the fastest 2,000 ODI runs vrv
Read MoreIND vs BAN: విరాట్ కోహ్లీని స్లెడ్జ్ చేయను.. కారణం ఏంటంటే: ముష్పీకర్ రహీమ్
ప్రపంచకప్‌లో భాగంగా గురువారం (అక్టోబర్ 19న) భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) తలపడనున్నాయి. భారత్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పీకర్ రహీమ్ (Mushfiqur Rahim) మాట్లాడాడు. టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని తానెప్పుడూ స్లెడ్జ్ చేయనని పేర్కొన్నాడు.
Read MoreCrickek World Cup 2023: కోహ్లీ నన్ను రెచ్చగొడతాడు.. నా వ్యూహం నాకు ఉంది : బంగ్లా …
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో చాలా దూకుడుగా ఉంటాడు. మ్యాచు ప్రారంభం నుంచి చివరి వరకు అంతే ఎనర్జీ విరాట్ సొంతం. ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తే అంతకంతకు తన బ్యాట్ తోనే సమాధానం చెబుతాడు. అయితే విరాట్ కోహ్లీ కూడా స్లెడ్జింగ్ చేస్తాడని బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. క్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. వికెట్ రాని పక్షంలో ప్రత్యర్థి బ్యాటర్ ఏకాగ్రతను చెడగొట్టాలని వారిని మాటలతో రెచ్చగొట్టడమే ఈ స్లెడ్జింగ్. ఈ క్రమంలో కొన్ని సార్లు అనుకూల ఫలితాలు వచ్చినా.. కొన్నిసార్లు మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు కోహ్లీ.. బంగ్లా వికెట్ కీపర్ రహీంని స్లెడ్జింగ్ చేస్తాడని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వరల్డ్ కప్ లో భాగంగా నేడు పూణే వేదికగా భారత్-బాంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య వార్ అంటే వివాదాలు, విమర్శలు సహజమే. ఈ సందర్భంగా బంగ్లా వికెట్ కీపర్ మాట్లాడుతూ..”నేను అతనితో ఆడినప్పుడల్లా ముఖ్యంగా బ్యాటింగ్‌కి వెళ్ళిన ప్రతిసారీ అతను నన్ను స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే కోహ్లీ పోటీతత్వం గల వ్యక్తి. అతను ఎప్పుడు గెలవాలని కోరుకుంటాడు. నేను విరాట్‌ను ఎప్పుడూ స్లెడ్జ్ చేయను, అతను ప్రేరణ పొందుతాడు. ప్రపంచంలోని కొంతమంది బ్యాటర్లు స్లెడ్జ్ చేయడానికి ఇష్టపడతారు. వీలైనంత త్వరగా అతడిని వదిలించుకోవాలని నా బౌలర్లకు నేను ఎప్పుడూ చెబుతుంటాను” అని రహీం చెప్పుకొచ్చాడు.
Read More